అక్కడ అబ్బాయిలకు అమ్మాయిలే ఖర్చు పెడతారట!

In China girls only give money for boy friends

12:53 PM ON 10th May, 2016 By Mirchi Vilas

In China girls only give money for boy friends

ఓ అమ్మాయి పక్కన నడిస్తే చాలు, 'ఆమె నా గర్ల్ ఫ్రెండ్' అని చెప్పుకు తిరిగే ఈ రోజుల్లో.. ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే చైనాలో అవమానంగా ఫీల్ అవుతారట. ఆ వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని డాంగ్వాన్ నగరంలో ఆసక్తికరమైన ట్రెండ్ కొనసాగుతుంది. అదేమిటంటే.. ఒక యువకుడు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కే పరిమితమైతే కనుక నామోషీ అట.. అంతా అతనిని ఎగతాళి చేస్తారంట. చేతకాని వాడిలా చూస్తారంట. ఎందుకంటే, అక్కడ ప్రతి ఒక్కరూ ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ ను కలిగి ఉంటారు. ఈ విషయంలో దాపరికం కూడా ఉండదు.

ఇది కూడా చదవండి: టీమిండియాకి కోచ్ గా ద్రావిడ్ వద్దు.. అతనే కావాలి: కోహ్లి

తన బాయ్ ఫ్రెండ్ కి వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసినా.. వారు పట్టించుకోరు సరికదా, తన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తారు. మరో అసలు విషయం ఏమిటంటే.. అక్కడ బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడానికి అమ్మాయిలే ఖర్చు చేస్తారు. గిఫ్టులే కాదు, డబ్బులు కూడా ఇస్తుంటామని అక్కడి అమ్మాయిలు తెలిపారు. దీనికి కారణం ఏమిటంటే.. అక్కడ వంద మంది అమ్మాయిలకు 89 మంది అబ్బాయిలే ఉన్నారు. ఈ సరికొత్త గర్ల్ ఫ్రెండ్స్ సంస్కృతి పై చైనా సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుండగా.. అమ్మాయిల సంఖ్య ఎక్కువ అయితే ఇలాగే ఉంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

అయితే ఆ పట్టణంలోని మహిళలు మాత్రం తాము డీసెంట్ అమ్మాయిలమని చెబుతున్నారు. ఎందుకంటే.. తాము ఎంత మందిని ప్రేమించినా బుద్ధిగా ఇంటికెళ్లి పెద్దలు కుదిర్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటామని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: భార్యను చంపి సేమ్ 'దృశ్యం' సినిమా కధలా మలిచాడు

English summary

In China girls only give money for boy friends. In China Girl Friends only spend money for their boy friends and also give gifts and money for boys.