అక్కడ ఎలా ప్రేమించాలో నేర్పుతారట!

In China their is course for that how to Love

05:58 PM ON 19th July, 2016 By Mirchi Vilas

In China their is course for that how to Love

ఇదేమైనా చదువా? లేక ఆట లేక వేరే ఏదైనానా నేర్పించడానికి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. అక్కడ ఎలా ప్రేమించాలో నేర్పుతారట. ఒకసారి వివరాల్లోకి వెళితే.. ప్రేమకు భాషతో సంబంధం లేదు, భావంతో సంబంధం లేదు. ఏ భాష్యమైనా ప్రేమకు ఒకటే.. రెండు మనసులను కలిపే పవిత్రమైన క్రియే ప్రేమ. ఎలా పని చెయ్యాలి? ఎలా చదవాలి వంటి ఎన్నో విషయాలు మనకు నేర్పుతారు. కానీ ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి అనే విషయంలో మాత్రం ఆ సూత్రాలేమీ ఉండవు. మహా అయితే స్నేహితులే కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. అయితే చైనా యువతకు ఈ కష్టాలేవీ ఉండవు.

ఎందుకంటే అక్కడ ప్రేమ గురించి ఓ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సే ఉంది. చైనాలోని 'టియాంజిన్' యూనివర్సిటీ అక్కడి యువతీయువకుల కోసం ప్రేమపై ప్రత్యేక కోర్సును అందిస్తోంది. చైనాలో చాలాకాలంగా 'సింగిల్ చైల్డ్'(ఒకే బిడ్డ) పాలసీ అమల్లో ఉండడంతో ఏకాకులుగా పెరిగిన చైనా యువతీయువకులు సమాజంలో సులభంగా కలవలేకపోతున్నారట. అక్కడ యువతలో ప్రేమ అనే భావమే ఉండడం లేదట. ఒకవేళ ఎవరైనా ప్రేమలో పడినా అది అవతలి వ్యక్తికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారట. అందుకే ఈ కోర్సును టియాంజిన్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ సోషల్ క్లబ్ సహా వ్యవస్థాపకుడు 'వాంగ్ రూ' ప్రవేశపెట్టాడు.

ఈ కోర్సులో భాగంగా అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలు ఎలా ప్రవర్తించాలి? ఎదుటి వ్యక్తి మనసు ఎలా దోచుకోవాలి? ఆకట్టుకునే విధంగా ఎలా అలంకరించుకోవాలి? ప్రేమను నిరాకరిస్తే ఏం చేయాలి? మొదలైన విషయాల్లో కోచింగ్ ఇస్తున్నారట. అంతేకాదు కోర్సు చివర్లో పరీక్షలు పెట్టి మార్కులు కూడా ఇస్తున్నారట. అదండీ అసలు సంగతి.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్లి చేరిపోండి..

English summary

In China their is course for that how to Love