కేజ్రీవాల్‌ కి రెండేళ్ల బుడతడు సవాల్‌

In Delhi Two years boy filed case on kejriwal

04:56 PM ON 7th January, 2016 By Mirchi Vilas

In Delhi Two years boy filed case on kejriwal

ఢిల్లీలో నర్సరీలో ప్రవేశం కోసం వయసు పరిమితి విధించారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ పై రెండున్నరేళ్ల పిల్లాడు ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేసాడు. ఢిల్లీలో ఈ నెల 1 తేదినుండి 22 వరకు పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతాయి. ప్రీస్కూల్‌ లో ప్రవేశాలకు నాలుగు సంవత్పరాల వయసు, ప్రైమరీ స్కూల్‌ కు ఐదు సంవత్సరాలు, ఒకటవ తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారించి ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డిసెంబర్‌ 18న సర్క్యూలర్‌ జారీ చేసింది. దాంతో ఢిల్లీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఉదయ్‌ ప్రతాప్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసాడు. ఉదయ్‌ ప్రతాప్‌ తరుపున న్యాయవాది, జారీ చేసిన సర్క్యుల్‌ర్‌ ని కొట్టేయాలని, దీనివల్ల ఉదయ్‌ 2017 వరకు ప్రీ-స్కూల్‌ ప్రవేశం పొందే అకాశం లేదని కోర్టులో అఖిల్‌ సచార్‌ వాదించారు. మార్చి 31 లోపు మూడు సంవత్సరాలు పూర్తి కాని పిల్లలకు కూడా ఈ సర్క్యులర్‌ వల్ల ప్రీ స్కూల్‌ లో అడ్మిషన్లు పొందలేరని అఖిల్‌ సచార్‌ వివరించారు. దీనికి కోర్టు స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌, డివోఈ కు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వారి సమాధానం పది రోజుల్లో తెలియజేయాలని సూచిస్తూ ఈ కేసును ఫిబ్రవరి 1 కి వాయిదా వేసింది.

English summary

In Delhi Two years boy filed case on kejriwal