అందులో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువట!

In India boys are doing maths well

03:40 PM ON 15th October, 2016 By Mirchi Vilas

In India boys are doing maths well

భారత్ లో అమ్మాయిల కంటే అబ్బాయిలే గణితంలో ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అయితే భాషా నైపుణ్యాల్లో అబ్బాయిలను అమ్మాయిలు దాటిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డ్యూక్ వర్సిటీ నిపుణులు అధ్యయనంలో ఈ విషయం తేల్చారు. 3,20,554 మంది అమెరికా విద్యార్థులు, 7,119 మంది భారత విద్యార్థులపై 2011 నుంచి 2015 మధ్య కాలంలో దీన్ని చేపట్టారు. విజ్ఞాన శాస్త్రంలో ఇటు అమెరికా, అటు భారత్ లోనూ అబ్బాయిలే మెరుగ్గా ప్రతిభ కనబరుస్తున్నట్లు దీనిలో తేలింది. గణితంలో అమ్మాయిలు ప్రతిభ కనబరిచేలా చూసేందుకు 1980 నుంచీ అమెరికా కృషిచేస్తోంది.

దీంతో ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. వీటిని భారత్ అనుసరిస్తే.. అక్కడా బాలబాలికలు సమానంగా విద్యలో రాణించగలుగుతారు అని పరిశోధన డైరెక్టర్ మాథ్యూ మాకెల్ వివరించారు. గణితంలో అమెరికా అమ్మాయిలు 28 శాతం మంది మంచి మార్కులు సాధిస్తే, భారత్ లో ఇది 11 శాతంగా వారు గుర్తించారు. భాషా నైపుణ్యాల్లో.. ఇవి వరుసగా 60, 62 శాతాలుగా వున్నాయి.

English summary

In India boys are doing maths well