ఇండియాలో మొత్తం 886 ప్రైవేటు ఛానెళ్లు

In India their is totally 886 private tv channels

12:51 PM ON 16th August, 2016 By Mirchi Vilas

In India their is totally 886 private tv channels

మనదేశంలో రోజుకో ఛానల్ పుట్టుకొస్తోంది. దేశంలో ప్రస్తుతం 886 ప్రైవేటు టీవీ ఛానెళ్లు పని చేస్తున్నాయి. ఈఏడాది జులై 31 వరకు గణాంకాలను సమాచార ప్రసారశాఖ విడుదల చేసింది. నిజానికి 1035 ఛానెళ్లకు లైసెన్సులున్నాయి. మరో 149 ఛానెళ్ల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. దాని ప్రకారం 886 ప్రైవేటు ఛానెళ్లలో 399 న్యూస్ ఛానెళ్లు వున్నాయి. దేశంలో 768 ఛానెళ్లకు అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ అనుమతులు ఉన్నాయి. వాటిలో 377 వార్తా ఛానెళ్లు, అలాగే 96 ఛానెళ్లకు కేవలం డౌన్ లింకింగ్ అనుమతుంది. వాటి అప్ లింకింగ్ విదేశాల్లో జరుగుతుంది. అందులో 15 వార్తా ఛానెళ్లు. 22 ఛానెళ్లు ఇక్కడి నుంచి అప్ లింకింగ్ అవుతున్నాయి. వాటికి ఇక్కడ డౌన్ లింకింగ్ కు అనుమతి లేదు. అందులో 7 వార్తా ఛానెళ్లు వున్నాయి.

English summary

In India their is totally 886 private tv channels