డాక్టర్ ఇంటికి వెళ్లి వచ్చేలోపు నర్స్ ఏం చేసిందో తెలుసా?

In nursing home nurse killed a patient with overdose injuction

06:10 PM ON 18th August, 2016 By Mirchi Vilas

In nursing home nurse killed a patient with overdose injuction

ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్స్ లు సరిగా ట్రైనింగ్ తీసుకోకుండానే పనిచేయడం వలన రోగుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నర్స్ చేసిన పొరపాటు 23 సంవత్సరాల యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈటా జిల్లాలోని డాక్టర్ ముఖేష్ జైన్ ఓ చిన్న నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు. అతనికి తోడు ఓ నర్స్ ను పెట్టుకుని వైద్యసేవలందిస్తున్నాడు. పెద్దాసుపత్రులకు వెళ్లే స్థోమత లేని వాళ్లు ఈ నర్సింగ్ హోమ్ ని ఆశ్రయించేవారు. ఈ క్రమంలోనే అక్లఖ్ అనే 23 ఏళ్ల కుర్రాడిని తండ్రి అస్ఫఖ్ ఈ నర్సింగ్ హోమ్ కు తీసుకొచ్చాడు.

డాక్టర్ అతని పరిస్థితిని గమనించి చికిత్స చేశాడు. రోగిని చూసుకోమని కంపౌడర్ కు చెప్పి ఇంటికెళ్లాడు. నర్స్ ఇంజక్షన్ ఇచ్చింది. ఓవర్ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపటికి రోగి శ్వాస తీసుకోవడం కష్టమైంది. కొద్దిసేపు కొట్టుమిట్టాడిన అతని శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. ఇంజక్షన్ ఓవర్ డోస్ కావడం వల్లే తన కొడుకు చనిపోయాడని యువకుడి తండ్రి ఆందోళనకు దిగాడు. కాబట్టి ఇప్పటికైనా నర్స్ లతో కాస్త జాగ్రత్తగా ఉండండి.

English summary

In nursing home nurse killed a patient with overdose injuction