బాలయ్య నిజ జీవితంలో కూడా 'డిక్టేటరే'!!

In real life also Balakrishna is dictator

03:37 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

In real life also Balakrishna is dictator

నందమూరి బాలకృష్ణ నటించిన 99వ చిత్రం 'డిక్టేటర్'. శ్రీవాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష కధానాయికలుగా నటించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిట్ర్ యూనిట్ సభ్యులు 'డిక్టేటర్' విజయోత్స యాత్ర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో ఉన్న 'అనుశ్రీ సినిమాస్' థియేటర్ కి ఈ చిత్ర బృందం వచ్చింది. ఈ సంధర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం సాధించినందుకు ప్రేక్షక దేవుళ్ళకు కృతఘ్నతలు.

ఈ చిత్రంలో నేను నటించిన పాత్ర నిజ జీవితంలో మక్కికి మక్కి ఇలానే ఉంటాను. అదే పాత్ర నేను డిక్టేటర్ లో చేశాను. ఇంతటి మంచి కథను నాకు అందించినందుకు డైరెక్టర్ శ్రీవాస్ కి నా కృతఘ్నతలు అని బాలకృష్ణ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీవాస్, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

English summary

Balakrishan role in Dictator movie is his original character in his real life. He told in Dictator success meet. This movie is directed by Srivaas.