వరంగల్ ఉప  పోరులో జోరుగా  తెరవెనుక యత్నాలు

In sub-scenes efforts under way Warangal

12:54 PM ON 20th November, 2015 By Mirchi Vilas

In sub-scenes efforts under way Warangal

ఓరుగల్లు ఉప పోరు ఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు చివరిరోజు ప్రచారం నిర్వహించి, ఇక ప్రచారం మిగియడంతో తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. గత 15 రోజులుగా తమకు ఆతిథ్యం ఇచ్చిన చారిత్రక నగరానికి వీడ్కోలు పలికారు. అయితే అభ్యర్ధులు , వారి అనుచరులు . బహిరంగంగా ప్రచారం చేసే అవకాశం లనందున తెరవెనుక కార్యకలాపాలకు పదును పెడుతున్నారు . శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని , ఇందుకోసం అందివచ్చే ప్రతిచిన్న అవకాశాన్ని జార విడుచుకోకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అన్ని దారులు అన్వేషించి , అమల్లో పెట్టేస్తున్నారు.

ఇక మొబైల్‌ నుంచే తాము చేయాల్సిన తతంగాన్ని వారు నడిపించడంలో నిమగ్నమయ్యారు. చాలా మంది విశ్రాంతి తీసుకుంటుంటే , కొందరైతే , రహస్య కేంద్రాల్లో వుండి చక్రం తిప్పుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బయటకు రాకుండా అక్కడి నుంచే పనులను చక్కదిద్దే పనిలో పడిపోయారు. పోలీసులు అన్ని హోటళ్లను ఖాళీ చేయించారు. స్థానికేతరులు ఉండకూడదని మైకులతో ప్రచారం నిర్వహించారు. తమ లక్‌ను పరీక్షించుకునేందుకు కొద్ది గంటలే ఉండడంతో అభ్యర్థులు బిజీబిజీగా ఇంటిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు.

మరోపక్క ప్రతి పార్టీ ఐదు లక్షల ఓట్లను టార్గెట్‌గా చేసుకొని తలా రూ.300 నుంచి రూ.500 వరకు పంపిణీ చేసే పనిలో పడిందన్న మాటలు వినవస్తున్నాయి. ఎవరికి వారే తమ పనులను గుట్టుగా జరుపుకుంటూ ఎవరి కంట పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా డబ్బులు డంప్‌ చేసినట్టు తెలుస్తోంది. కులాలు, సంఘాల వారీగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తెల్లారితే ఇక పోలింగ్ కనుక ఈలోగానే తాయిలాలు అందించాలని ఉబలాట పడుతున్నారు. గెలుపే లశ్యంగా అన్ని దారులను వెతుకుతున్నారు. ఓటర్లూ పారా హుషార్.

English summary

In sub-scenes efforts under way Warangal