ఎమ్మెల్యేలను చిన్నమ్మ దాచేసిందోచ్

In Tamilnadu Camp politics begins

06:38 PM ON 9th February, 2017 By Mirchi Vilas

In Tamilnadu Camp politics begins

తమిళనాట అధికార పగ్గాలు చేపడ్తామ్ తరువాయి అనుకున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. ముఖ్యంగా జయలలితకు నమ్మిన బంటుగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం, ఇప్పటి పరిస్థితులలో శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో ఏఐఎడిఎంకె లో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్యాంపురాజకీయాలకు తెరలేపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన చతురతను చూపిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించారు.

తనకు మద్దతు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యేల నుంచి సంతకాలు సేకరించిన శశికళ, వాళ్లతో కలసి రేపు రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఆ ఎమ్మెల్యేలను వివిధ రహస్య ప్రాంతాలకు తరలించారు. శశికళ వర్గీయులు దగ్గరుండి ఎమ్మెల్యేలను బస్సుల్లో ఎక్కించి తరలించినట్టు చెబుతున్నారు. అంతటితో సరిపెట్టకుండా, ఎలాంటి ఒత్తిళ్లుకు తలొగ్గకుండా ఆమె అనుచరులు ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇరువైపులా వ్యూహ ప్రతివ్యూహాలు పదును దేరుతున్నాయి.

English summary

In Tamilnadu Camp politics begins.