ఆ సమస్యలు వల్ల అక్కడ శృంగారం తక్కువట!

In this country romance was very low

11:37 AM ON 30th July, 2016 By Mirchi Vilas

In this country romance was very low

ఏ దేశంలో అయినా.. ఎక్కడైనా సెక్స్ కామన్.. సృష్టిలో ఉన్న ప్రతీ జీవికి ఇదో గొప్ప కార్యం. అయితే మనం మనుషులం కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. తాజాగా ఒక దేశంలో సెక్స్ తక్కువగా చేసుకుంటారని తేలింది. ఇంతకీ అది ఏ దేశం అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం.. స్వీడన్ దేశ ప్రజల్లో సెక్స్ తక్కువేనని తాజాగా ఆ దేశ ప్రభుత్వం జరిపిన తాజా సర్వేలో తేలింది. స్వీడన్ దేశ ప్రజల్లో ఏర్పడిన తీవ్ర ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వారి సెక్స్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. లైంగిక, పునరుత్పత్తి, ప్రజల సెక్స్ అలవాట్ల గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయట.

లైంగిక సూచికలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తుందని, ఇది రాజకీయ సమస్యగా మారుతుందని ప్రజా ఆరోగ్య శాఖామంత్రి గాబ్రియేల్ విక్ స్ర్టోమ్ చెప్పారు. ప్రజల లైంగిక అలవాట్లు, పునరుత్పత్తి సమాచారాన్ని ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రభుత్వమే పెడుతుంది. సెక్స్ ప్రజల జీవితాలతో పాటు ఆరోగ్యంపై ప్రభావితం చూపుతున్నందున దీనిపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదికను సిద్ధం చేయాలని స్వీడన్ ప్రజారోగ్య శాఖ కోరడం విశేషం.

English summary

In this country romance was very low