టాలీవుడ్‌ లో 'ప్రభాస్'దే కాస్ట్‌లీ కార్‌!

In tollywood Prabhas is only using costly car

01:48 PM ON 29th December, 2015 By Mirchi Vilas

In tollywood Prabhas is only using costly car

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన రేంజ్‌నే మార్చేశాడు. బాహుబలి చిత్రం తరువాత ఎన్నో దిగ్గజ కంపెనీలు ప్రభాస్‌ని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని అడుగుతున్నారు. ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటే ఎన్ని కోట్లైనా ఇస్తామంటూ ఎన్నో కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ తను ఆర్డర్‌ చేసిన కారు ఇటీవలే డెలీవరీ అయిందట. బాహుబలి చిత్రం తరువాత మహీంద్రా కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన ప్రభాస్‌ ఆ కంపెనీ వారు ఇచ్చిన పారితోషికంతో ఈ కారుని కొన్నాడట.

రోల్స్‌ రాయిస్‌ సిరీస్‌కి చెందిన ఈ కారు దాదాపు 8 కోట్లు రూపాయలని సమాచారం. ఈ కారు డెలవరీ అయ్యాక ప్రభాస్‌ తన సన్నిహితులని తన ఫార్మ్ హౌస్‌కి పిలిచి మరీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడట. టాలీవుడ్‌ హీరోలైన రామ్‌చరణ్‌, పవన్‌కళ్యాణ్‌, మంచు విష్ణు, మనోజ్‌, నాగ చైతన్య వంటి హీరోలు రేంజ్‌ రోవర్‌ కార్లు వాడుతుంటే ప్రభాస్‌ ఏకంగా రోల్స్‌ రాయిస్‌ కారు తెప్పించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. టాలీవుడ్‌ లో ఇంత ఖరీదైన కారు వాడుతుంది ఒక్క ప్రభాస్‌ మాత్రమే. బాహుబలి చిత్రంతో ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌ ఇంక బాహుబలి-2 విడుదలైతే ఏ రేంజ్‌ కు ఎదుగుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

English summary

In tollywood Prabhas is only using costly car Rolls Royce car. This car cost is approximately 8 crores.