ఈ నగరంలో నాన్ వెజ్ నిషేధం!

In Turin city they are not allowed for non veg

03:18 PM ON 25th July, 2016 By Mirchi Vilas

In Turin city they are not allowed for non veg

ఇదేమిటి ఇండియాలో ఇలాంటి పరిస్థితి లేదే అంటుకుంటున్నారా? ఇండియాలో కాదండి బాబూ, సాక్షాత్తూ ఇటలీలోనట. అవునా అని ఆశ్చర్య పోవచ్చు కానీ నిజం. ఎందుకంటే, ప్రపంచమంతా నాన్ వెజ్ రుచులతో గుమ్మెత్తిపోతుంటే.. ఇటలీలోని ట్యూరిన్ సిటీ మాత్రం దీనికి పూర్తిభిన్నంగా వాతావరణం రాజ్యమేలుతోంది. ఇక్కడ నాన్ వెజ్ కి పూర్తి వ్యతిరేకం అట. అంతేకాదు నాన్ వెజ్ తినాలనుకుంటే మా ఊరు మాత్రం రావొద్దని ట్యూరిన్ వాసులు అనేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమంటే, కొద్దిరోజుల్లో ట్యూరిన్ నగరాన్ని పూర్తి వెజిటేరియన్ సిటీగా మార్చాలని సిటి చైర్మన్ డెసిషన్ తీసుకున్నారట. అయితే ఈ వెజిటేరియన్ నిర్ణయంపై ఇటలీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి కూడా. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా అమలు చేసుకుపోతున్నారు.

ఇటీవల జూన్ లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఫైవ్ స్టార్ మూవ్ మెంట్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పర్యావరణం, పౌరుల ఆరోగ్యం, జంతువుల సంక్షేమం కాపాడటానికి శాఖాహారాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించింది. దీనిప్రకారం వచ్చే ఐదేళ్ల కాలంలో శాఖాహార ప్రయోజనాల గురించి బాలలకు బోధిస్తారు. భూమిని, జంతువుల హక్కులను కాపాడుతూ ఏ విధంగా మంచి ఆహారం తీసుకోవాలంటూ బాలలకు వివరిస్తారని పేర్కొన్నారు. అయితే రుచికరమైన మాంసపు ఉత్పత్తులు లభించే ట్యూరిన్ సిటిలో మేయర్ తీసుకున్న నో నాన్ వెజ్ నిర్ణయంపై పలువురు కారాలు మిరియాలు నూరుతున్నారట. ఇలాంటి నిర్ణయాలు భారత్ లో సాధ్యమా చెప్పండి.

English summary

In Turin city they are not allowed for non veg