కాశీ లో తప్పనిసరిగా చూడవలసినవి

In Varanasi things you should absolutely not miss

09:42 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

In Varanasi things you should absolutely not miss

వారణాసిని భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగానే కాకుండా భూమిపై అత్యంత దిగ్భ్రాంతి కలిగించే మరియు సందర్శించదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు. ప్రతి రెండు సెకన్లకు మనకు కొత్త మరియు ఉత్తేజకరమైన ఏదో ఒక విషయం కనబడుతుంది. వారణాసిలో పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. వారణాసిలో గంగా నది చరిత్ర, అర్థాలు, చిహ్నాలు, సంస్కృతి మరియు మతం అన్ని ఒక మేజిక్ లా ఉంటాయి. ఇప్పుడు వారణాసిలో ఖచ్చితంగా చూడవల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. గంగా హారతి

గంగా హారతిని సాయంత్రం నిర్వహిస్తారు. ఈ నది యొక్క ప్రాముఖ్యత బిలియన్ మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ ప్రదేశంలో శాస్త్రం మరియు మతం, మానవ భావోద్వేగాలు మరియు నమ్మకాలు అన్ని ఉన్నాయి. ఈ అద్భుతమైన నదిని చూసినప్పుడు, నదికి సొంత ఆత్మ ఉంటుందని తెలుసుకుంటాం. ఆ ప్రదేశంలో వేలాది మంది  ప్రార్థనలు చేయటం, వంగి నమస్కరించటం, దీపాలను వెలిగించి గంగా నదిలో వదలటం వంటివి మంత్రముగ్దులను చేస్తాయి. ఈ విధంగా చేయటం వలన చేసిన పాపాలు పోతాయని నమ్మకం.

English summary

Ganga aarti is performed in the evening. That is when it dawn on you the significance of this river, the hearts of billion people. The Gange River is a magical place, full of history, meanings, symbols, culture and religion.