అలా చెప్పేసి...ఇలా బుక్కయ్యాడు ‘సరైనోడు’ ?

Income Tax Notices To Allu Aravind

12:46 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Income Tax Notices To Allu Aravind

కొన్ని కొన్ని పరిణామాలు ఓ పక్క ఆనందం కలిగించినా పక్కనే ఇబ్బంది కూడా పొంచి ఉంటుదని అంటారు. ఇప్పుడు బన్నీ వషయంలో కూడా అదే జరిగిందా అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే, ప్రస్తుత సమ్మర్‌‌ సీజన్ లో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ‘సరైనోడు’ కేవలం 20 రోజులకు 100 కోట్లు కలెక్ట్ చేసినట్టు స్వయంగా హీరోయే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది. దీంతో అర్ధసెంచరీ, సెంచరీ వేడుకలకు గ్రాండ్‌గా చేస్తారని, అందులోనూ సొంత బ్యానర్ కావడంతో ఏమాత్రం వెనక్కి తగ్గడని అభిమానులు అనుకున్నారు.

అంతేకాదు ప్రెస్‌మీట్ లు పెట్టి కూడా కలెక్షన్స్ గురించి చెప్పేశాడు. కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్‌ టాప్-5 సినిమాల్లో ఇదొకటని వార్తలొచ్చాయి. మరి ఇన్ని విషయాలు చెప్పాక ఇన్ కం టాక్స్ (ఐటీ) కన్ను పడకుండా ఉంటుందా? అసలే ‘సరైనోడు’ హంగామా పై తొలి నుంచి ఫోకస్ పెట్టిన ఇన్ కం టాక్స్ (ఐటీ) అధికారులు ఇప్పుడు వచ్చే ప్రకటనల నేపధ్యంలో వచ్చిన రాబడికి పన్ను కట్టారో లేదో తెలుసుకునేందుకు ప్రొడ్యూసర్‌కు నోటీసులు పంపినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి ‘సరైనోడు’ ఈ విధంగా బుక్కయ్యాడంటూ ఇండస్ర్టీలో సెటైర్లు పడిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి: ఏ గుడికి ఏ టైంలో వెళ్ళాలో తెలుసా ?

ఇవి కూడా చదవండి:ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

English summary

Allu Arjun's Latest Movie "Sarainodu" was become Super Hit at the box office and now it collects 100 crores gross and this was posted by Allu Arjun in Twitter and now due to this post Income Tax Department kept an eye on this movie collections and recently according to a news fro mfilm industry Income Tax Department send notices to Sarinodu Movie Producer Allu Aravind for Tax issues.