ప్రొడ్యూసర్ ఇంటిపై ఐటి దాడులు

Income Tax officials raid on Sai Korrapati

04:21 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Income Tax officials raid on Sai Korrapati

గత కొంత కాలంగా సినిమా వాళ్లపై ఐటీ శాఖ దాడులు చేసిన వార్తలు పెద్దగా వినిపించడం లేదు. గతంలో ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతున్నా, ఈ మూవీ నిర్మాతల ఇల్లు-ఆఫీసులపై ఐటీ దాడులు జరిగేవి. కొన్నాళ్లుగా సినిమారంగాన్ని పెద్దగా పట్టించుకోని ఐటీ శాఖ, ఇప్పుడు సాయి కొర్రపాటి ఇల్లు-ఆఫీస్ లను తనిఖీ చేయడం హాట్ న్యూస్ అయిపోయింది. టాలీవుడ్ లో జోరు మీదున్న ప్రొడ్యూసర్లలో సాయి కొర్రపాటి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈగ.. ఊహలు గుసగుసలాడే, వంటి చిత్రాలతో పాటు, రీసెంట్ గా మనమంతా.. జ్యో అచ్యుతానంద వరకూ అనేక మంచి సినిమాలను తీసిన అనుభవం గల సాయి కొర్రపాటి ఇటు నిర్మాతగా బిజీగా ఉంటూనే, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ సత్తా చాటుతున్నాడు.

తాజాగా బాహుబలి 2 కి కూడా కొన్ని పెద్ద ఏరియాలకు రైట్స్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత స్పీడ్ చూపిస్తున్న ఈ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ పై దాడులు చేసిన ఐటీశాఖ, దాదాపు 6 గంటల పాటు వరుస ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆదాయానికి సంబంధించిన మూలాలపైనా.. అకౌంట్స్ లో కనిపిస్తున్న తేడాలపైనా ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. తన దగ్గరున్న అన్ని రకాల పత్రాలను సాయి కొర్రపాటి సమర్పించగా, వీటిలో తేడాలు ఉన్నాయో లేదో మాత్రం ఆదాయపు పన్ను శాఖ వెల్లడించలేదు. ఈ దాడులతో కొందరు ప్రొడ్యూసర్లు, బడాబాబులు కూడా తగు జాగ్రత్తలో ఉంటున్నారట.

English summary

Income Tax officials raid on Sai Korrapati