బాప్ రే .. ఐటీ దాడుల్లో ఎంత డబ్బు దొరికిందో

Income Tax Raiding on Black currency

12:05 PM ON 17th December, 2016 By Mirchi Vilas

Income Tax Raiding on Black currency

పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడికి ఎన్ని ఆంక్షలు విధించినా సరే, కొంతమంది వక్రమార్గంలో నోట్లను మార్చేసుకుని దాచేసారు. నోట్ల కోసం ప్రజలు గంటలకొద్దీ బ్యాంకుల దగ్గర, ఏటీఎం ల దగ్గర క్యూ కట్టి నానా అవస్థలు పడుతుంటే, పక్కనుంచి యథేచ్ఛగా కొందరికి నోట్లు మార్చేశారు. అంతేకాదు నోట్ల మార్పిడికి ఇంకా పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఐటీశాఖ వీటిని తిప్పికొట్టేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా అనుమానాలు ఉన్న ప్రతిచోట దాడులు నిర్వహిస్తోంది. పట్టుబడుతున్న నోట్లలో కొత్త నోట్లు భారీగానే ఉన్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికి దేశ వ్యాప్తంగా 586 చోట్ల దాడులు నిర్వహించి రూ.2,900 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 79 కోట్లు విలువగల రూ.2000 నోట్లు ఉన్నాయని, రూ.2,600 కోట్లు లెక్కల్లో లేని నగదు అని వివరించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చెన్నైలో నిర్వహించిన ఒక్క తనిఖీలోనే రూ.100కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

డిల్లీలోని ఓ లాయర్ ఇంట్లో రూ.14కోట్లు స్వాధీనం చేసుకోగా ఆయన అకౌంట్ నుంచి రూ.19కోట్లు సీజ్ చేశారు. మహారాష్ట్రలోని పుణె బ్యాంక్ లో ఒకే వ్యక్తికి సంబంధించిన 15 లాకర్లలో రూ.9.58 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 8కోట్ల విలువైన కొత్త రూ.2000 నోట్లు కాగా మిగతావి 100 నోట్లని అధికారులు చెప్పారు.

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చూడండి:
ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతల పై హెయిర్ రీగ్రోత్ మొదలవుతుంది

English summary

Government banned 1000 and 500 rupees notes to stop the Black currency in India, But still Black currency is increasing. Recently Income Tax Department found huge new currency notes in their raiding.