దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఐటి దాడులు ... భారీగా కొత్త నోట్ల స్వాధీనం

Income Tax Raids on Black money

11:29 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Income Tax Raids on Black money

పెద్ద నోట్ల తర్వాత జనం బ్యాంకుల దగ్గర,ఏటీఎం లదగ్గర పడిగాపులు కాస్తుంటే, మరోపక్క కొత్త నోట్లు దొడ్డిదారిన కొందరికి చేరిపోవడంతో ఇక్కట్లు కొనసాగుతున్నాయి. దీంతో నల్లధనంపై దేశవ్యాప్తంగా ఐటి అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. పలువురు అక్రమార్కుల వద్ద భారీగా కొత్త నోట్లు లభిస్తుండడం విశేషం. ఇది చూసి అందరూ ఖంగు తింటున్నారు. ఆయా రాష్ట్రాల్లో తాజాగా పట్టుబడిన సొమ్ము ఇలా వుంది.

పంజాబ్ : అమృత్ సర్ లో హెరాయిన్ విక్రయిస్తున్న ముగ్గురు మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారుల నుంచి రూ.15.49 లక్షలు స్వాధీనం చేసుకోగా, అందులో రూ.12 లక్షలు కొత్త నోట్లు ఉన్నాయి. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

గుజరాత్ : సూరత్ లో వడ్డీ వ్యాపారం చేస్తున్న ఒకప్పటి చాయ్ వాలా నుంచి రూ.10.50 కోట్ల ఆస్తిని ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.1.05 కోట్ల కొత్త నోట్లు, రూ.1.49 కోట్లు విలువ చేసే బంగారం, రూ.4.92 కోట్ల నగలు, రూ.1.39 కోట్ల ఇతర నగలు, 1.28 కోట్ల వెండి ఉంది. మరో మూడు బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ : నేపాల్ సరిహద్దులోని పల్లియా పట్టణంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.58 వేల కొత్త నోట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ : ఢిల్లీ శివారులోని నోయిడా సెక్టర్ -57లో ముగ్గురు వ్యక్తుల వద్ద రూ.57 లక్షల కొత్త నోట్లు దొరికాయి. వీరిని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం, ఆదాయపన్ను శాఖ అధికారులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

English summary

Common peolpe were still suffering a lot with Banning of old 500 and 1000 rupees Notes. The rush near the ATM'S and Banks was still there, but many people already exchanged there old notes in Lakhs and Crores. IT department started raids on those people to catch the Black money.