ట్రైలర్ అంటే ఇలా కుడా ఉంటుందా!

Independence Day Resurgence trailer

05:53 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Independence Day Resurgence trailer

మనం రోజు ఎన్నో చిత్రాల ట్రైలర్స్ చూస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ ఇలా ఎన్నో... కానీ ఎన్ని ట్రైలర్స్ చూసినా ఏదో వెలితి. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ట్రైలర్ చూస్తే ట్రైలర్ అంటే ఇలా కూడా ఉంటుందా అని అనిపించక మానదు.. అసలు అదేం సినిమా? అని అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి పదండి.. 20 ఏళ్ల కిందట యావత్ ప్రపంచాన్ని దుమ్ములేపిన చిత్రం ‘ఇండిపెండెన్స్ డే’. అప్పట్లో ఈ చిత్రం ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది.. ఈ సినిమా గురించే గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘ఇండిపెండెన్స్ డే రిసర్జెన్స్’ అనే సినిమా వస్తోంది.

దాదాపు 200 మిలియన్ డాలర్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం త్వరలోనే మన ముందుకు రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించి ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 2 నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్‌లో అన్నిరకాల కోణాలను చూపించాడు డైరెక్టర్. ఎలైన్ అనే టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు తెలుస్తోంది. భూమి అనే ప్లానెట్‌ని రక్షించడానికి డిఫెన్స్ ఫోర్స్ ఏం చేసిందన్నది ఇందులో మొయిన్ థీమ్. రోనాల్డ్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ జూన్‌లో విడుదల కానుంది.

English summary

Independence Day Resurgence trailer.