టీమిండియా.. టీ20ల్లో టాప్‌ టీమ్..

India As ICC Number One T20 Team

04:32 PM ON 8th March, 2016 By Mirchi Vilas

India As ICC Number One T20 Team

టీ20 ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ప్లస్ దక్కించుకుంది. ఆసియాకప్‌ ఫైనల్‌ లో ధోని సేన బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 127 పాయింట్లతో భారత్‌ టాప్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత వరుసగా వెస్టిండీస్‌ (118), దక్షిణాఫ్రికా(118), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లాండ్‌ (112), ఆస్ట్రేలియా (111), పాకిస్థాన్‌(110)లు ఉండగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంక (109) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లికి రెండో స్థానం దక్కింది. రోహిత్‌ శర్మ 11, సురేశ్‌ రైనా 16, యువరాజ్‌ 22, ధోని 43, శిఖర్‌ ధావన్‌ 48వ స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్‌ విభాగంలో అశ్విన్‌ రెండో స్థానంలో, రవీంద్ర జడేజా 11, బుమ్రా 27, యువరాజ్‌ 43వ స్థానంలో కొనసాగుతున్నారు.

English summary

Recently International Cricket Council (ICC) has released the T20 Rankings and in that Team India was top in the latest ICC T20 Rankings after India won T20 Asia Cup In Bangladesh.