సంపన్న దేశాల్లో భారత్ సెవెంత్ ప్లేస్

India As Seventh Wealthiest Country In The World

10:43 AM ON 24th August, 2016 By Mirchi Vilas

India As Seventh Wealthiest Country In The World

కర్మ భూమి, వేదభూమి అయిన భారతదేశం ఓ ప్రత్యేకత సంతరించుకుంది. అదే భిన్నత్వంలో ఏకత్వం. ఇది భారతదేశానికి మాత్రమే ఉన్న ఏకైక లక్షణం. అది సంస్కృతి పరంగానే కాదు, ఆర్థిక, అభివృద్ధి అంశాల్లోనూ కన్పిస్తుంది. ఎందుకంటే, ఈ దేశంలో రూ.10కీ భోజనం దొరుకుతుంది. అలాగే రూ.1000కీ భోజనం దొరుకుతుంది. అయితే ఉన్నవాళ్లు మరింత ఉన్నవాళ్లు అవుతుంటే, పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. అయితే సంపన్న దేశాల టాప్ -10 జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. భారత్ మొత్తం 5,600 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉందని ‘న్యూ వరల్డ్ వెల్త్ ’ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. భారత్ పేద దేశం కాదని చెప్పడానికి ఈ నివేదిక ఒక నిదర్శనం.

దేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన సగటు నికర ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. ఇందులో ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. గత ఐదేళ్లలో చైనా వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అదేవిధంగా భారత్ , ఆస్ట్రేలియా కూడా త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే కేవలం 12 నెలల వ్యవధిలోనే ఇటలీని వెనక్కి నెట్టి కెనడా ముందు వరసలోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి:సుకుమార్ అసిస్టెంట్ సూసైడ్

ఇవి కూడా చదవండి:వైజాగ్ రైల్వేస్టేషన్ కి తరలివస్తున్న కుర్రాళ్ళు.. ఇంతకీ అక్కడ ఏముంది?

English summary

India Stood as seventh largest country in the world according to an survey made by an organisation. According to that list America Stood in first place and China stood in Second place.