మాల్యాను  అప్పగించ మని కోరిన భారత్

India Asks Britain To Deport Vijay Mallya

03:09 PM ON 29th April, 2016 By Mirchi Vilas

India Asks Britain To Deport Vijay Mallya

కింగ్ ఫిషర్ విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్ ను భారత ప్రభుత్వం కోరింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణం చెల్లించకుండా విజయ్‌ మాల్యా లండన్‌లో ఉంటున్న నేపధ్యంలో.ఆయన బిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి భారత్‌ విచారించాల్సి ఉందని, తప్పకుండా మాల్యాను వెనక్కి పంపాలని భారత విదేశాంగ శాఖ బ్రిటన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. విజయ్‌ మాల్యా మార్చి 2న దేశం విడిచి లండన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరవ్వాలని ఈడీ పలుమార్లు సమన్లు పంపినా పట్టించుకోవడం లేదు. మాల్యా పాస్‌పోర్టును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయినా స్పందన లేదు. విజయ్‌ మాల్యా 2003లో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. సాధారణ ధరలకే భారతీయులకు లగ్జరీ ప్రయాణం అందిస్తామంటూ ప్రారంభించిన ఈ ఎయిర్‌లైన్స్‌ 2012కల్లా దివాలా తీసి మూతపడింది. మాల్యా పలు బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా లండన్‌ వెళ్లారు. దీని పై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. మరోపక్క మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం తో పాటూ అక్కడ ఓటు హక్కు కూడా పొందారంటూ రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పదు

ఇవి కూడా చదవండి:'బాహుబలి 2' లో జయదేవ్ రాణాగా ఎన్టీఆర్!

English summary

India asks Great Britain to deoprt Vijay Mallya to India, Vijay Mallya was the citizen of Britain and he have vote in Britain Also. He was taken 9 Thousand crores of Loan from Banks.