సౌతాఫ్రికాని చిత్తు చేసిన భారత్‌!!

India beat South Africa with 124 runs defeat

06:26 PM ON 27th November, 2015 By Mirchi Vilas

India beat South Africa with 124 runs defeat

నాగ్‌పూర్: భారత్‌-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కొహ్లీసేన సఫారీలను రెండు రోజులు ఆట మిగిలి ఉండగానే ఆలౌట్‌ చేసేసింది. ఈ గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన ఆశ్విన్‌ రెండు ఇన్నింగ్స్‌లో 12 వికెట్లు తీసి సౌతాఫ్రికాని మట్టి కరిపించాడు. 124 పరుగుల తేడాతో సౌతాఫ్రికాని ఓడించి నాలుగు టెస్టుల సీరిస్‌లో 2-0 తో సీరీస్ని కైవసం చేసుకున్నారు. దీనితో పాటు గత తొమ్మిది సంవత్సరాలుగా సౌతాఫ్రికా విదేశాల్లో టెస్టు సిరీస్‌ ఓడిపోని రికార్డుని కోహ్లీసేన బద్దలు కొట్టింది. 32/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికా 310 పరుగుల లక్ష్యచేధనలో 185 పరుగులకే చతికలబడింది.

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ హషిమ్ ఆమ్లా (39), డుప్లెసిస్‌ (39) తప్ప ఎవరూ 20 పరుగులు దాటి కూడా చేయలేదు. ఒకానొక సమయంలో సౌతాఫ్రికా 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా ఆమ్లా, డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే క్రమంలో 72 పరుగులు పార్ట్నర్షిప్ నిర్మించారు. కానీ టీ విరామానికి ముందు ఈ పార్టనర్‌షిప్‌ని అమితా మిశ్రా తన చక్కటి బంతితో విడదీశాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు మన స్పిన్ ఉచ్చుకి నిలబడలేక పెవిలియన్‌ దారి పట్టారు. దీనితో కోహ్లీసేన చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

భారత్‌-సౌతాఫ్రికాల మధ్య ఆఖరు టెస్టు డిసెంబర్‌ 3న ఢిల్లీలో ఫిరోజ్‌ షో కోట్లా మైదానంలో జరగనుంది.

English summary

India beat South Africa with 124 runs defeat in Nagpur. Aswin took 12 wicket in two innings.