ఐక్యరాజ్యసమితికి భారత్‌ చేయూత

India Donates 34 Crores To UNO

07:17 PM ON 18th December, 2015 By Mirchi Vilas

India Donates 34 Crores To UNO

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే విపత్తులకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి భారీ విరాళాన్ని ప్రకటించి భారత్ మరో సారి తన పెద్ద మనసు చాటుకుంది. 2015-16 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి అత్యవసర సేవల విభాగమైన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్‌కు 5,00,000 డాలర్లు(రూ. 34 కోట్లు) విరాళంగా అందించింది. ఇంతే మొత్తాన్ని 2014 సంవత్సరానికి ప్రకటించింది. మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ముందు నుంచే ప్రపంచ దేశాల్లో తలెత్తిన విపత్తులకు భారత్ సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు తమ వంతుగా భారత్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే విపత్తులకు సహాయం అందించే విషయంలో తమ వంతు సహకారం అందింస్తామని భారత్ తరుపున ఐక్యరాజ్య సమితి సేవల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ తెలిపారు.

English summary

India donateds huge ammount to United Nations Organisation(UNO) for 2015-2016 respone fund. India had contributed $500,000 to the Central Emergency Response Fund