ఈ-కామర్స్@50 బిలియన్‌ డాలర్స్

India E-commerce market may reach Rs 3.4 lakh crores

11:34 AM ON 11th February, 2016 By Mirchi Vilas

India E-commerce market may reach Rs 3.4 lakh crores

భారత ఈ-కామర్స్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. 2020 కల్లా భారత ఈ-కామర్స్‌ లావాదేవీలు ఐదు రెట్లు పెరిగి 8-12 బిలియన్‌ డాలర్ల నుంచి 40-50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందట. ఈ విషయాన్ని ప్రఖ్యాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఇండియా రిటైల్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2020 ఏడాదికి అమ్మకాలు 60 శాతం పెరిగితే అందులో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వాటా 30 శాతం ఉంటుందని తెలిపింది. ఇంటర్నెట్‌ యూజర్లు 260 మిలియన్ల నుంచి 650 మిలియన్లకు చేరుకోవడంతో అమ్మకాల్లో వృద్ధి ఉంటుంది. యూజర్ల సంఖ్య పట్టణాల్లో 80-120, గ్రామాల్లో 29-40 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 2020లోపు 400 మిలియన్ల వినియోగదారులు డిజిటల్‌ ప్రభావానికి గురవుతారు. వీరిలో 25 శాతం మంది ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ధరలు పరిశీలించి వస్తువులు కొనుగోలు చేస్తారని నివేదిక తెలిపింది.

English summary

India's e-commerce market is expected to reach Rs 2.7 lakh crore to Rs 3.4 lakh croreby 2020. This was said by Boston Consulting Group and Retailers Association of India.These two groups have made a research and found that Indian E-commerce Market will reach 3.4 lakh crores by 2020