ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా

India Enters Into Asia Cup Finals

11:48 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

India Enters Into Asia Cup Finals

టీ20 ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో టీమిండియా ఫైనల్ చేరింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను భారత్‌ బౌలర్లు బుమ్రా(2/27), పాండ్య(2/26), అశ్విన్‌(2/26)బెంబేలెత్తించారు. కపుగెదెర(30), సిరివర్ధనె(22) రాణించడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనలర్లు రోహిత్‌ శర్మ(15), శిఖర్‌ ధావన్‌(1) నిరాశపరిచారు. రైనా(25), కోహ్లి (56 నాటౌట్‌), యువరాజ్‌(35) రాణించడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టోర్నీలో మూడు వరుస విజయాలు సాధించిన టీమిండియా 6 పాయింట్లతో ఫైనల్‌ చేరింది. వరుసగా రెండో ఓటమితో శ్రీలంక ఫైనల్ చేరే అవకాశాలు క్లిష్టంగా మారాయి.

మ్యాచ్ సాగిందిల.....

1/11 Pages

టాస్

బౌలర్లకు సహకరిస్తున్న పిచ్ పై టాస్ గెలిచి శ్రీలంక ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

English summary

India enters into Asia Cup Finals by Beating Srilanka in yesterday match by 5 wickets.Indian Star Batsman Virat Kohli smashes a commanding Half Century against Srilanka.