పాక్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్!

India gave shock to Pakistan

11:03 AM ON 30th September, 2016 By Mirchi Vilas

India gave shock to Pakistan

సహనానికి ఓ హద్దు ఉంటుంది. అది తొలగిపోతే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కి భారత్ రుచి చూపించింది. ఈనెల 18న పాక్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ముష్కరులు ఉరీలో భారత సైనిక శిబిరంపై దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాల ఎగసింది. పాక్ కు బుద్ధి చెప్పాల్సిందేనని భారత్ ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా.. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు గుణపాఠం తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ సైన్యం జూలు విదిల్చారు.

పాక్ పెంచి పోషిస్తూ వస్తున్న ఉగ్రవాదుల దాడులతో ఏళ్లుగా దెబ్బలు తిని, గాయాలకు ఓర్చుకున్న భారతీయ ఆర్మీ.. ప్రభుత్వ సూచనలతో పాకిస్తాన్ కంటి మీద కునుకుతీయలేని దెబ్బకొట్టింది. 40 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాకిస్తానీ సైనికులను కాల్చి పారేసింది. 9 మంది పాక్ సైనికులూ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఐదు ఉగ్ర క్యాంపులు నేలమట్టం ఇవీ కేవలం నాలుగు గంటల వ్యవధిలో 25 మంది భారతీయ సైనికులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సృష్టించిన భీభత్సం. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..

యూరీ ఉగ్రదాడి తర్వాత భారత్ లో మరిన్ని విధ్వంసాలను సృష్టించేందుకు పీఓకేలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని భారత నిఘా వ్యవస్ధలకు సమాచారం అందింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ను నిర్వహించేందుకు ప్రణాళిక రచించాలని సూచనలిచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అవకాశానికి భారతీయ ఆర్మీ చక్కని వ్యూహాన్ని తయారు చేసింది.

1/12 Pages

ఘాటైన సందేశం...


38 మంది ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న వారితో పాటు... చొరబాట్లకు దన్నుగా నిలుస్తున్న ఇద్దరు పాక్ సైనికులను హతం చేసింది. పంటికి పన్ను కాదు... ఏకంగా దవడ మొత్తం పగలగొడతాం అని ఘాటైన సందేశం పంపింది. ఈ దాడుల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) రణ్ బీర్ సింగ్ గురువారం మధ్యాహ్నం బయటికి ప్రపంచానికి వెల్లడించారు. అంతే... ఒక్కసారిగా కలకలం, పెను సంచలనం! రణ్ బీర్ ప్రకటనతోపాటు రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...

English summary

India gave shock to Pakistan