పారిస్ ఘటనతో భద్రత కట్టుదిట్టం

India get alert after Paris incident

12:09 PM ON 14th November, 2015 By Mirchi Vilas

India get alert after Paris incident

పారిస్‌ నరమేధం, తదుపరి దాడి రష్యా పైనే అని ఉగ్రవాద సంస్థల ప్రకటనల నేపథ్యంలో భారత్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను సోదాలు నిర్వహిస్తున్నారు. పారిస్ నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లు జరిగిన ఘటనలో 150 మంది మృత్యువాత పడడం, పలువురు క్షత గాత్రులవడం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ పారిస్ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ , అన్నివిధాల ఫ్రాన్స్ కి అండగా ఉంటామని ప్రకటించారు. ఇక అగ్రరాజ్యం అమెరికా సైతం పారిస్ ఘటనతో అప్రమత్తమైంది. ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

English summary

India get alert after Paris incident. After hearing Paris terrorist incident India alerted