భారత్‌-పాక్‌ మధ్య సిరీస్‌ జరగాలి: గంగూలీ, ఇంజమామ్

India Pakistan Series To Be Held

04:08 PM ON 8th March, 2016 By Mirchi Vilas

India Pakistan Series To Be Held

దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య దైపాక్షక సిరీస్‌ జరగాలని, అప్పుడే ఇరు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడుతుందని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్ హక్‌ అన్నారు. ఢిల్లీలో ఓ టీవీ షోలో పాల్గొన్న వీరిద్దరూ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ‘భారత్‌, పాక్ సిరీస్‌ జరగడం వల్ల పరిస్థితులు సద్దుమణిగి, మైత్రీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది. భారత్‌, పాక్ మ్యాచ్‌లను చూడాలని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్లు తమ అభిమాన ఆటగాళ్లను, ఆటను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కనుక సిరీస్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఇంజమామ్‌ పేర్కొన్నాడు. వాళ్లను ఎప్పుడూ శత్రువులుగా భావించలేదని, అయితే వారితో ఆడేటప్పుడు స్ఫూర్తి పొందుతామని, సరైన జోడీగా భావిస్తామని, అప్పట్లో వారి జట్టులో లోపాలను వెతకడం కష్టంగా ఉండేదని, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆటడం అద్భుతమైన అనుభూతి అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

English summary

India Ex-Captain Sourav Ganguly and Pakistan Ex- Captain Inzamam-ul-Haq says that India Pakistan series should be held.Soo many people in India and Pakistan were waiting to see series against India and Pakistan.They said that India- Pakistan series were bigger than Ashes Series