మనోళ్ల వాడకం మామూలుగా లేదు..

India Reaches Second Places In Smartphone Users

09:27 AM ON 4th February, 2016 By Mirchi Vilas

India Reaches Second Places In Smartphone Users

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇదే. పదేళ్ల క్రితం కుటుంబానికి ఫీచర్ ఫోన్ ఉంటే ఎక్కువ అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కో ఫోన్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ ఫోన్‌లు అధికంగా వాడే దేశాల్లో ఇండియా రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి ఈ ఫేస్ లో ఉన్న అమెరికా వెనక్కెళ్లిపోయింది. ఈ విషయాన్ని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌కు చెందిన విశ్లేషకుడు తరుణ్‌ పాఠక్‌ తెలిపారు. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. 2015 నాటికి మనదేశంలో 220 మిలియన్ల మందికిపైగా యాక్టివ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు ఉన్నారు. భారత్‌లో ఎక్కువ మంది వాడుతున్న స్మార్ట్‌ ఫోన్లు సామ్‌సంగ్‌వే. దీంతో అది ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మైక్రోమ్యాక్స్‌, మూడో స్థానంలో యాపిల్‌ సంస్థలు నిలిచాయి. యాపిల్‌ వినియోగదారులు 2015లో గణనీయంగా పెరిగారు. యాపిల్‌ ఒక ఏడాదిలో 20 లక్షల ఫోన్లు అమ్మడం భారత్‌లో ఇదే తొలిసారి. గతేడాది స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు కూడా 15శాతం వృద్ధి సాధించాయి. గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో అయితే 23శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ లెక్కల్ని బట్టి చూస్తే మరో సంవత్సరంలో షిప్‌మెంట్లు 100 మిలియన్ల మైలు రాయిని దాటతాయని అంచనా వేస్తున్నారు.

English summary

India has inched past the US to become the second largest smartphone market in terms of active unique smartphone user base in the world with the base crossing 220 million users