వరుణుడు దెబ్బతీశాడు!

India- South Africa 2nd Test Match Draw

03:40 PM ON 20th November, 2015 By Mirchi Vilas

India- South Africa 2nd Test Match Draw

బెంగుళూరు : ఇండియా, సౌత్‌ ఆఫ్రికా జట్ల మధ్య జరగబోతున్న రెండో టెస్టుకు వరుణుడు అంతరాయం కల్పించాడు. బెంగళూరులో కురుస్తున్న కుండపోత వర్షం వల్ల డ్రాగా ఫలితాన్ని ముగించారు.

చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు సౌత్‌ ఆఫ్రికా బ్యాటింగ్‌కి దిగింది. అశ్విన్‌ స్విన్‌ మాయాజాలంతో సౌత్‌ ఆఫ్రికా 214 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత బ్యాటింగ్‌కి దిగిన ఇండియా వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసి మొదటి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

గెలుపు ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆ తరువాత మూడు రోజులు ఆటకు వరుణుడు దెబ్బేశాడు. ఐదో రోజైన ఆట కొనసాగుతుందనుకుంటే వర్షం వల్ల ఔట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది. దీనితో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

English summary

India- South Africa 2nd Test Match Draw