బ్లాక్‌ మనీలో భారత్‌ కు నాల్గవ స్ధానం

India Stands Fourth Place In Black Money

01:23 PM ON 10th December, 2015 By Mirchi Vilas

India Stands Fourth Place In Black Money

ప్రపంచంలో అక్రమ సంపద కలిగిన దేశాలలో భారత్‌ నాలుగో స్ధానంలో ఉంది. ఇటీవల ఏ దేశం నుండి ఎక్కవ బ్లాక్‌ మనీ ఎక్కువగా ఉందో అని ఒక యుఎస్‌ సంస్ధ చేసిన అధ్యాయంలో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి.

ఎక్కువ బ్లాక్‌మనీ కలిగిన దేశంగా చైనా 139 బిలియన్‌ యుఎస్‌ డాలర్ల బ్లాకు మనీతో మొదటి స్ధానంలో ఉండగా, రష్యా 104 బిలయన్‌ యుఎస్‌ డాలర్లతో రెండో స్ధానంలో ఉంది, మూడో స్ధానంలో మెక్సికో 52.8 బిలియన్‌ యుఎస్‌ డాలర్ల బ్లాకు మనీతో, మన భారత దేశం 50 బిలియన్‌ యుఎస్‌ డాలర్ల బ్లాక్‌ మనీతో నాలుగో స్ధానంతో ఉంది.

2004-2014 కాలం మధ్య భారతదేశం యొక్క నల్లధనం విలువ 510 బిలియన్‌ యుఎస్‌ డాలర్లుగా ఉందని నివేదిక తెలిపింది . అదే సమయంలో చైనా దేశం యొక్క బ్లాక్‌ మనీ 1.39 ట్రిలియన్‌ యుఎస్‌ డాలర్ల గాను, రష్యా బ్లాక్‌మనీ 1 ట్రిలియన్‌ యుఎస్‌ డాలర్ల గాను ఉందని ఆ నివేదిక తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి 2004-2013 సంవత్సరాలలో ఎక్కువగా అక్రమ ధనం తరలింపు జరుగుతుందనీ 2011 వ సంవత్సరానికి ఈ సంఖ్య 1 ట్రిలియన్‌ యుఎస్‌ డాలర్లకు చేరుకుందని వెల్లడించారు. అవినీతి,పన్నుల ఎగావేత లాంటి ఇతర కార్యకలాపాల వల్ల నల్లధనం ఎక్కువగా తరలిపోతుందని నివేదిక తెలిపింది .

English summary

According to one study in U.S the countries with more black money rankings were released recently. In that list china tops in the list and russia,mexico are in second,third places respectively. India stans in fourth place in that list