ఆసీస్ టూర్ కు 19న టీమిండియా ఎంపిక

India Team To Be Selected For Austraslia Tour

04:43 PM ON 17th December, 2015 By Mirchi Vilas

India Team To Be Selected For Austraslia Tour

జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత క్రికెట్‌ జట్టును ఈ నెల 19న ఎంపిక చేయనున్నారు. ఢిల్లీలో సందీప్‌ పాటిల్‌ అధ్యక్షతన సమావేశమయ్యే సెలెక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేస్తుందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌ సిరీస్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఆసీస్‌ పర్యటనకు భారత్‌ జట్టును ఎంపిక చేయనుండం ఆ దేశంతో సిరీస్‌ జరగదనే అభిప్రాయం క్రీడా వర్గాల్లో వ్యక్తమవుతుంది. సిరీస్‌పై ఎన్నో ఆశలతో ఉన్న పాక్‌కు నిరాశ తప్పేటట్లు లేదు. ఆస్ట్రేలియా పర్యటనకు జనవరి 6న భారత్‌ బయలుదేరి వెళ్లుతుంది. జనవరి 12 నుంచి 31 వరకూ 5 వన్డేలు, మూడు టీ20ల్లో పాల్గొంటుంది. పెర్త్‌, బ్రిస్బెన్‌, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, సిడ్నీ నగరాల్లో వన్డేలు, అడిలైట్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీల్లో టీ20లు జరుగుతాయి. భారత వన్డే, టీ20 జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనీనే కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

English summary

Indian Cricket Team selection committee of the Cricket Board (BCCI) will select the Indian team for the upcoming Australia Tour which is going to be starting January 12.