టీ20 వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్‌: సచిన్‌

India Team Was Favorites In World T20

10:34 AM ON 4th February, 2016 By Mirchi Vilas

India Team Was Favorites In World T20

మార్చిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ధోనీ సేనే హాట్ ఫేవరెట్‌ అట. ఈ విషయాన్ని చెపుతోంది క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ తెందుల్కర్‌. ప్రస్తుతం టీమిండియా సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా ఉందని, ఆస్ట్రేలియా సిరీస్‌లో యువబౌలర్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని కొనియాడారు. యువరాజ్‌, నెహ్రా, హర్భజన్‌ పునరాగమనంతో జట్టు కూర్పు దుర్భేధ్యంగా తయారైందన్నాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్‌ చేయడం మధురానుభవమని సచిన్‌ అన్నారు. ఆసీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా రైనా మ్యాచ్‌ను కచ్చితంగా గెలిపిస్తాడని తన భార్య అంజలి, కుమారుడు అర్జున్‌కు చెప్పినట్లు వివరించారు.

English summary

Cricket God Sachin Tendulkar says that present Team India was the favorite team in Upcoming World T20 tournament.He says that young bowler Bhumra's bowling was awesome.