400 ఏళ్ళ క్రితమే భారత్ లో ఏసీ రూమ్స్

India To Have AC Rooms Before 100 Years

11:27 AM ON 18th February, 2016 By Mirchi Vilas

India To Have AC Rooms Before 100 Years

భారతదేశం అన్ని విద్యలకు మూలం. కర్మ భూమి ,వేద భూమి అయిన భారత్ సకల శాస్త్రాలకు పుట్టినిల్లు. అగ్గిపెట్టెలో చీరను పెట్టి బహుమతిగా అందించిన టెక్నాలజీ ఆరోజుల్లోనే వుందంటే, భారత్ వైభవం ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. వేల సంవత్సరాల చరిత్రకు నిలువు టద్దం గా ఇండియా భాసిల్లుతోంది. ఇక వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ శీతల గదులు (ఏసీ రూమ్స్) వాడారంటే, దాని గురించి విపులంగా తెలుసుకోవాల్సిందే మరి....  మొఘల్ వంశ రాజులలో మంచి రాజుగా పేరొందిన  అక్బర్ చక్రవర్తి తన కనుసైగలలో దాదాపు దేశంలోని అన్ని రాజ్యాలను  ఉంచుకున్నాడని చెప్పవచ్చు. ఎంతో అందంగా  ఫతేపూర్ సిక్రీ లో  రాజభవనం నిర్మించుకున్నఅక్బర్ ఎన్నో అధునాతన సౌకర్యాలను ఆరోజుల్లోనే సమకూర్చుకున్నాడు. అందుకే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు. నైపుణ్యం గల వర్కర్స్ ని సమీకరించి నిర్మించిన  అక్బర్ కాలం నాటి  అందమైన రాజభవనాలలో ఆ రాజభవనం గురించి ఇప్పటికీ  గొప్పగా చెప్పుకుంటారు.

1/5 Pages

  ‘బులంద్ దర్వాజా’భవనం.....

    అయితే అక్బర్ నిర్మించుకున్న రాజభవనాలలో ,400 ఏళ్ళ క్రితం ‘బులంద్ దర్వాజా’భవనం ఓ ప్రత్యేకత సంతరించుకుంది.  అసలు  భవనం ఎలాంటి వేడి వాతావరణాన్ని లోపలికి దరిచేరనీయదట. అలాగే అందులో ఎంతో చల్లగా ఉండడమే కాదు,   వేసవి తాపం నుంచి ఉపశమనం కల్గిస్తుందట. ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వ కూడదన్న ఉద్దేశ్యంతో దాదాపు  20 గదులను అక్కడ నిర్మించాడు. ఎండాకాలంలో, విపరీతమైన వేడి ఉన్నప్పుడు ఇక్కడికి వెళితే, చల్లని ఏసీ గదిలో వున్నట్టు వుంటుంది. అందుకే వేసవి వస్తే, అక్బర్ భార్యలను వెంట బెట్టుకుని ఇక్కడ  విడిది చేసేవాడట. అంటే 400 ఏళ్ళ క్రితం  ఎలాంటి ఫ్యాన్, ఏసి,కూలింగ్ సంబంధించిన వస్తువులు లేకుండానే అక్బర్, ఎసిని మరపించే  చల్లదనాన్ని  ఏర్పాటు చేశాడన్నమాట. 

English summary

India to have Air Conditioned Rooms at the time of Akbar Period before 400 years.This was recently invented by scientists in India.