ఫిబ్రవరిలో లంకతో టీ20 సిరీస్

India To Play T20 Series With Srilanka In February

05:07 PM ON 21st January, 2016 By Mirchi Vilas

India To Play T20 Series With Srilanka In February

ఆస్ట్రేలియా టూర్ తర్వాత టీమిండియా ఫిబ్రవరిలో శ్రీలంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఆసియా కప్‌ కు ముందు ఫిబ్రవరి 9న ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. శ్రీలంక జట్టు భారత్‌కు వస్తుంది. ఆసియా కప్‌ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ పుణలో జరిగే తొలి టీ20తో ప్రారంభమవుతుంది. తర్వాత ఇరు జట్లూ ఢిల్లీకి వెళతాయి. ఫిబ్రవరి 12న ఢిల్లీలో రెండో మ్యాచ్‌ జరుగుతుంది. తర్వాత 14వ తేదీన విశాఖపట్నంలో చివరి, మూడో టీ20 జరుగుతుంది. 2014 టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత ఇరు జట్లూ స్వల్ప సిరీస్‌లో తలపడడం ఇదే తొలిసారి. గత టీ20 వరల్డ్‌ కప్‌లో శ్రీలంక గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు గతేడాది నవంబర్‌లో టెస్టు స్థాయి పొందిన మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం మూడో అంతర్జాతీయ మ్యాచ్‌కు, రెండో టీ20కి ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత ఇండియా, శ్రీలంక జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 24 నుంచి బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. తర్వాత మార్చి 9వ తేదీ నుంచి భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌లో పాల్గొంటాయి.

English summary

India to play T20 series with Srilanka in Coming February.New Delhi India will host Sri Lanka in a three-match series starting February 9 ahead of Asia Cup and World T20.