అండర్‌-19 వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండీస్‌

India to Play With West Indies in Under-19 World Cup final

10:19 AM ON 12th February, 2016 By Mirchi Vilas

India to Play With  West Indies in Under-19 World Cup final

అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్ కప్‌ ఫైనల్‌లోకి కరీబియన్ టీమ్ వెస్టిండీస్‌ అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లు తేడాతో విండీస్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 226 పరుగులు చేసి ఆలౌటైంది. 227 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అజేయ అర్థశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విండీస్‌ ఆటగాడు స్ప్రింగర్‌(59 నాటౌట్‌) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఫేవరెట్‌ జట్టయిన భారత్‌ ఇప్పటికే ఫైనల్‌కు చేరింది. 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

English summary

India to face West Indies in Under 19 world cup final.Two days ago India has entered into the final and recently west Indies won against the host Bangladesh in the semi final and enters into the finals.