ఫేస్బుక్ వ్యక్తిగత డేటా నిర్మూలనకు భారత్ నుండి అధిక విన్నపాలు

India top position in the list of Facebook data removal requests

02:22 PM ON 13th November, 2015 By Mirchi Vilas

 India top position in the list of Facebook data removal requests

సోషల్ మీడియాలో రారాజుగా వెలుగుతున్న ఫేస్బుక్కు భారత ప్రభుత్వం నుండి వ్యక్తిగత డేటా నిర్మూలనకు అధికశాతం విన్నపాలు వెళ్తున్నట్లు ఒక నివేదికలో తెలిసింది. ప్రస్తుతం ఫేస్బుక్లో అత్యధిక ఖాతాదారులను కలిగిన దేశంగా భారత్ ముందంజలో ఉంది. అందుకే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బెర్గ్ సైతం భారత్ పై అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఫేస్బుక్లో తమ తమ భావాలను స్వేచ్ఛగా చాటుకునేందుకు ప్రతీఒక్కరికీ అవకాశం ఉండడంతో వివాదాస్పద విషయాలపై, మత సంబంధిత విషయాలపై ఎవరికీ తోచింది వారు తమ భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకునే సౌలభ్యం వచ్చింది. అయితే ఈ సౌకర్యాన్ని దుర్వినియోగపరచుకునేందుకు అరాచక శక్తులు కాచుకొని ఉన్నాయి కూడా. ఒక సమూహాన్ని ప్రభావితం చేసేలా గానీ లేదా తప్పుదారి పట్టించేలా ఫేస్బుక్ వేదికపై వ్యాఖ్యలకు, వివాదాలకు దిగుతున్నారు. వీళ్ళను నియంత్రించడం నిజంగా ప్రభుత్వాలకు కత్తిమీద సామే. ఇలాంటి అరాచక శక్తులకు కళ్ళెం వేయడానికి భారత ప్రభుత్వమే కాకుండా మిగిలిన అన్ని ప్రపంచ దేశాలకు చెందిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఫేస్బుక్ వెంట పడుతోంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి డేటా రిక్వెస్ట్ సంఖ్య 18శాతం పెరిగింది. ఇందులో అగ్రభాగం భారత్ నుండే ఉండడం విశేషం. కనుక ఏదైనా సున్నితమైన వ్యాఖ్యలను ఫేస్బుక్లో లైక్ చేసేముందు లేదా షేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.

English summary

India top position in the list of Facebook data removal requests.Facebook removal requests mostly from India.