ఇండియాలో పెరుగుతున్న మొబైల్ వినియోగదారులు..

India Tops In Mobile Phone Users

06:05 PM ON 18th November, 2015 By Mirchi Vilas

India Tops In Mobile Phone Users

ఇటీవల జరిగిన ఒక అధ్యాయనం ప్రకారం భారత్‌ లో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య గణణీయంగా పెరిగిందని పేర్కొంది. ఈ సంవత్సరం జులై-సెప్టెంబర్‌ మధ్య 13 మిలియన్ల మొబైల్ వినియోగదారుల పెరిగారని తెలిపింది ఈ నివేదిక ప్రకారం భారత్‌ లో ప్రతి నిమిషానికి ఒక ముబైల్‌ కనెక్షన్‌ యాక్టివేట్‌ అవుతుందని తెలిపింది.ప్రతియేట ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం మొబైల్ వినియోగదారులు పెరుగుతున్నారని తెలిపింది . మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ లో అత్యధికంగా 13 మిలియన్ల కొత్త మొబైల్ వినియోగాదారులు పెరిగి మొదటి స్ధానంలో ఉండగా,రెండో స్ధానంలో చైనా (7 మిలియన్లు),మూడో స్ధానంలో యు.ఎస్‌.(6 మిలియన్లు) నాలుగో స్ధానంలో మయన్మార్‌ (5 మిలియన్లు) ,ఐదో స్ధానంలో నైజీరియా (4 మిలియన్లు) లు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 87 మిలియన్ల కొత్త వినియోగదారులు వచ్చి చేరారని తెలిపింది. ఈ ఏడాది త్రైమాసికంలో 75 శాతం ముబైల్‌ ఫోన్లు అమ్ముడయ్యాయని ఈ సంఖ్య 2021 నాటికి 85 శాతానికి పెరుగుతుందని తెలిపారు.

English summary

Global mobile subscriptions are growing around 5 per cent year-on-year. India grew the most in terms of net additions during the quarter (a gain of 13 million), followed by China (7 million), the US (6 million), Myanmar (5 million), and Nigeria (4 million)," the report by the telecom gear maker said.