భారత్‌-పాకిస్తాన్‌ సిరీస్‌కు లైన్‌ క్లియర్‌!!

india vs pakistan series line cleared

03:43 PM ON 24th November, 2015 By Mirchi Vilas

india vs pakistan series line cleared

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగే సిరీస్‌కు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠను తెరదించుతూ భారత్‌ తన చిరకాల ప్రత్యర్ధి అయిన పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు ఆటంకాలు తొలగిపోయాయి. అయితే పాకిస్తాన్‌ భారత్‌లో ఆడేందుకు అంగీకరించలేదు, భారత్‌ యూఏఈలో ఆడేందుకు అంగీకరించలేరు. అందువల్ల శ్రీలంక పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇరు జట్లు లంకలో ఆడేందుకు అంగీకారం వ్యక్తం చేశాయి. దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే అదికారికంగా ఈ నెల 27న ప్రకటిస్తారు.

శ్రీలంకలోని ప్రేమదాస, పల్లెకలె మైదానాల్లో మ్యాచులు జరగనున్నాయి. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం భారత్‌-పాకిస్తాన్‌ మధ్య రెండు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు జరగాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్‌ వల్ల కేవలం రెండు టి20లు, మూడు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉంది.

English summary

india vs pakistan series line cleared by board members. But series is not helding in India and pakistan. Series is at Srilanka.