భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టెస్ట్‌..

India vs South Africa 3rd test details

06:17 PM ON 24th November, 2015 By Mirchi Vilas

India vs South Africa 3rd test details

దక్షిణాఫ్రికా 72 రోజుల భారత్‌ పర్యటనలో టి20 సిరీస్‌, వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా గెలిచి భారత్‌ని దెబ్బ తీసింది. అయితే దానికి ప్రతీకారంగా మొదటి టెస్ట్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బే ఇచ్చింది. రెండో టెస్టులోనూ భారత్ గెలవాల్సింది కానీ వర్షం కారణం వల్ల రెండో టెస్టు రద్దయ్యింది. రేపటి (నవంబర్‌ 25) నుండి నాగపూర్‌లోని విదర్భ మైదానంలో ఈ మూడో టెస్టు జరగనుంది. ఈ స్టేడియంలో 45 వేల మంది ప్రేక్షకులు కుర్చోవచ్చు. ఇక్కడ మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నవంవబర్‌ 2008 లో జరిగింది.

ఆఖరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ కూడా భారత్‌-ఆస్టేలియా మధ్య అక్టోబర్‌ 30, 2013న జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్లు తేడాతో గెలిచింది. 2010లో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌ లో ఒక మ్యాచ్‌ ఇక్కడే జరిగింది. ఈ మ్యాచ్‌లో హషీమ్‌ ఆమ్లా 253 పరుగులు, కలీస్ 173 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌కి 558 పరుగులు చేశారు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఆరు పరుగులతో భారత్‌ని చిత్తుగా ఓడించింది. మళ్లీ దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య రేపు టెస్టు జరగబోతుంది.

English summary

India vs South Africa 3rd test match in nagpur vidarbha stadium. After 2nd test was drawn it is very precious to india to win the test series.