టీ-20 వరల్డ్‌ భారత్‌దే!

India will Win T20 World Cup

03:26 PM ON 20th November, 2015 By Mirchi Vilas

India will Win T20 World Cup

హైదరాబాద్‌ : 2016లో స్వదేశంలో జరగబోతున్న టి-20 వరల్డ్‌ కప్‌ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని భారత్‌ మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. టీ20లో ఇండియా ప్రదర్శన ఎప్పుడు బాగుందని పైగా ఇది మన స్వదేశంలో జరగుతుంది కాబట్టి భారత్‌కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇండియా టీమ్‌ చాలా బాగుందని వాళ్లు ఇంకా మెరుగుపడితే ఖచ్చితంగా వరల్డ్‌కప్‌ మనదే అని చెప్పారు. ప్రస్తుతం సౌత్‌ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సీరీస్‌ చాలా ఆసక్తిగా ఉంది. కోహ్లీసేన ఫస్ట్‌ టెస్ట్‌లో అద్భుతంగా ఆడి సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. వర్షం పడకపోతే రెండో టెస్ట్‌ కూడా కోహ్లీసేన గెలిచేదే అని వ్యాఖ్యానించారు. మొదటి టెస్ట్‌ విజయంతో కోహ్లీసేన చాలా ఆత్మవిశ్వాసంగా ఉంది. ఇదే కొనసాగాలని కోరుకుంటున్నా అని శ్రీకాంత్‌ తెలియజేశారు.

English summary

India will Win T20 World Cup