దక్షిణాఫ్రికా ఫై  భారత్ గెలుపు

India Wins Over SouthAfrica

07:55 PM ON 7th November, 2015 By Mirchi Vilas

India Wins Over SouthAfrica

మొహాలిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో 108 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

కొత్త టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సొంతగడ్డ పై తొలి టెస్ట్ విజయం సాధించాడు . తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌటైన భారత్ దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్ లో 184 పరుగులకే ఆలౌట్ చెయ్యగలిగింది.17 పరుగుల ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ 200 పరుగులకు ఆలౌటయింది.

దీంతో 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్లు అశ్విన్ , జడేజా , మిశ్రా లు కట్టడి చెయ్యడంతో దక్షిణాఫ్రికా కేవలం 39.5 ఓవర్లలో 109 పరుగులకే చాప చుట్టేసింది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త మూడు రోజుల్లోనే ముగిసింది.

మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి రవీంద్ర జడేజా తన సత్తాచాటాడు. తన స్పిన్ మాయాజాలంతో దక్షిణాఫ్రికా బాట్స్ మెన్ వెన్నువిరిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఫలితంగా 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది . వన్డే , టీ-20 సిరీస్ లను కోల్పోయిన భారత జట్టు లో ఈ విజయం ఆత్మ విశ్వాసాన్ని నింపింది . దీపావళికి ముందు భారత అభిమానులకు చక్కటి విజయంతో అలరించింది . ఈ నెల 14న నుండి బెంగళూరులో రెండో టెస్ట్ మొదలుకానుంది.

English summary

India Wins Over SouthAfrica