లంకపై టీ20 సిరీస్‌ గెలిచిన భారత మహిళలు

India women’s team won T20 Series Against Srilanka

04:44 PM ON 27th February, 2016 By Mirchi Vilas

India women’s team won T20 Series Against Srilanka

వన్డే సిరీస్ లో శ్రీలంకను ఓ ఆట ఆడుకున్న భారత మహిళా క్రికెటర్లు టీ20ల్లోనూ ఆ జట్టును వైట్ వాష్ చేశారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకొంది టీమిండియా. రాంచిలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. లంక టీమ్ లో ఇషనీ లోకసురియగ(25) టాప్ స్కోరర్. భారత బౌలర్‌ ఏక్తా బిషత్‌ 3, అనుజ పాటిల్‌ 2 వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత ఓపెనర్లు స్మృతి మంధన(43), వెల్లస్వామి వనిత (34) లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో టీమిండియా 13.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 91 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

English summary

The Indian women’s cricket team dished out a clinical performance to thrash Sri Lanka by nine wickets in the third and final Twenty20 International and complete a 3-0 series whitewash, in Ranchi on Friday.