చారిత్రాత్మక 500వ టెస్టులో భారత్ ఘన విజయం!

India won 500th test against Newzealand

04:49 PM ON 26th September, 2016 By Mirchi Vilas

India won 500th test against Newzealand

టెస్టు క్రికెట్ చరిత్రలో టీంఇండియా ఆడుతున్న చారిత్రాత్మక 500వ టెస్టులో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో అభిమానులకు గుర్తుండిపోయే క్షణాలను అందించింది. ఈ మ్యాచ్ లో భారత తొలి ఇన్నింగ్స్ లో 318 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 262 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ లు కోల్పోయి 377 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. న్యూజిలాండ్ ముందు 434 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 434 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 87.3 ఓవర్లలో 236 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

కివీస్ టాపార్డర్ ఆటగాడు ల్యూక్ రోంచీ(80; 120 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. అతన్ని రవీంద్ర జడేజా వేసిన చక్కటి బంతితో పెవిలియన్ కి పంపించాడు. సాంట్నార్(71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. తొలి టెస్టులో భారత జట్టు 197 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు తీసుకొని.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. ఇండియా ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్ లో 88వ విజయం కాగా.. న్యూజిలాండ్ పై 19వ విజయం ఖావడం గమనార్హం..

English summary

India won 500th test against Newzealand