చివరి టీ20 కూడా ఊదేశారు

India Won T20 Series Against Australia

05:05 PM ON 1st February, 2016 By Mirchi Vilas

India Won T20 Series Against Australia

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసేసింది. సిడ్నీలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా చివరి ఓవర్‌లో 17 పరుగులు సాధించి గెలుపొందింది. చాలాకాలం తర్వాత టీమ్ లోకి వచ్చిన యువరాజ్‌ (15 నాటౌట్‌: 12 బంతుల్లో 1×4, 1×6)వరుసగా చివరి ఓవర్ తొలి రెండు బంతుల్ని ఫోర్‌, సిక్స్‌గా బాది మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. సురేశ్‌ రైనా (49 నాటౌట్‌: 25 బంతుల్లో 6×4, 1×6) చివరి బంతిని బౌండరీకి తరలించి భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ(52), శిఖర్‌ ధావన్‌(26), విరాట్‌ కోహ్లి(50) రాణించారు. అంతకుముందు టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడిన అరోన్‌ ఫించ్‌ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన వాట్సన్‌ (124 నాటౌట్‌: 71 బంతుల్లో 10×4, 6×6) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి సెంచరీ చేశాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (14), షాన్‌ మార్ష్‌ (9), మాక్స్‌వెల్‌ (3) తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్‌ చేరుతున్నా.. వాట్సన్‌ తన జోరు కొనసాగించాడు. షాన్‌ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జత చేసిన షేన్‌ వాట్సన్‌.. నాలుగో వికెట్‌కి ట్రావీస్‌ హెడ్‌(26)తో కలిసి 7.5 ఓవర్లలోనే 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో ఆశిష్‌ నెహ్రా, అశ్విన్‌, జడేజా, యువరాజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

English summary

Team India won the last T20 in the match against Australia.India claim thrilling last-ball win over Australia to complete series whitewash.