టీ20 ఆసియా కప్‌ మనదే..

India Won The Asia Cup 2016

11:47 AM ON 7th March, 2016 By Mirchi Vilas

India Won The Asia Cup 2016

ఆసియా కప్‌లో టీమిండియా దుమ్మురేపింది. మీర్పూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి కప్ ను సొంతం చేసుకుంది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌(13), సౌమ్య సర్కార్‌(14) తొలి వికెట్‌కు 27 పరుగులు చేశారు. వీరి ఔట్‌ తర్వాత షబ్బీర్‌ రెహ్మన్‌(32 నాటౌట్‌), షకిబ్‌ అల్‌ హసన్‌(21) మూడో వికెట్‌కి 34 పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు. చివర్లో మహ్మదుల్లా(33) చెలరేగిపోయాడు. దీంతో హార్దిక్‌ పాండ్య 21 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో బంగ్లా 120 పరుగులు సాధించింది. అశ్విన్‌, నెహ్రా, బుమ్రా, జడేజా తలో వికెట్‌ తీశారు. లక్ష్య ఛేదనలో శిఖర్‌ ధావన్‌ (60), విరాట్‌ కోహ్లి (41) రాణించారు. ఆఖర్లో కెప్టెన్‌ ధోని (20) మెరుపులు ఫినిషింగ్ షాట్ తో భారత్‌ 13.5 ఓవర్లలోనే గెలిచింది. టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది వరుసగా ఆరోసారి. శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

English summary

India won the Asia Cup for the 6th time in the history.India faced Bangladesh in the final match in Asia Cup 2016.