29మందితో ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సయ్యింది

Indian Air Craft AN 32 Missing

10:51 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Indian Air Craft AN 32 Missing

ఈమధ్య ఎక్కువగా విమానాలు, హెలికాఫ్టర్లు అదృశ్యం అవుతున్నాయి. ఇలా మిస్సయిన వాటిలో చాలావరకూ కూలిపోయినట్లు తేలింది. తాజాగా చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ వెళ్తోన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైంది. ప్రతివారం వెళ్లే రొటీన్ ట్రిప్ లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు 29 మంది సిబ్బందితో ఎఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ చెన్నై తంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ పయనమైంది. అయితే, బయలుదేరిన కొద్దిసేపటినుంచే కంట్రోల్ రూమ్ తో ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధాలు తెగిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఎయిర్ క్రాఫ్ట్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయి.

బంగాళాఖాతం సముద్రం గుండా ఫ్లైట్ ప్రయాణించాల్సిన దారి వెంబడి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఇండియన్ నేవీ పి-81, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ తోపాటు, నాలుగు షిప్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మంచి గుర్తింపు ఉన్న ఎఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ ను రష్యా తయారు చేసింది. ఈ విమానం తక్కువ పరిధిలో కూడా టేకాఫ్, లాండింగ్ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఆచూకీ లభ్యం కావడం లేదు. ఇందులో ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇళ్లల్లో విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి:తండ్రి వజ్రాల వ్యాపారి.. కొడుకు బేకరీలో పనివాడు(రియల్ స్టోరీ)

ఇవి కూడా చదవండి:భార్యపై అనుమానంతో ఆమె ల్యాప్ టాప్ చూసిన భర్తకు షాక్!

English summary

Indian Air Force Air Craft AN-32 was missed yesterday and this Air Craft Carrying 29 People. Till now this Air Craft was not found and Navy and Air Force were in Search for this Air Craft.