మణిరత్నంకు వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఏమైంది?

Indian army gave a warning to Maniratnam

02:38 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Indian army gave a warning to Maniratnam

అప్పట్లో 'రోజా', 'బొంబాయి'.. వంటి చిత్రాల్ని తీసి.. హాట్ టాపిక్ గా మారిన డైరెక్టర్ మణిరత్నం.. తాజాగా మరో ప్రయోగం చేయబోతున్నాడు. ఈసారి.. ఏకంగా జమ్ముకాశ్మీర్ బోర్డర్ లో షూటింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే అక్కడ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ ముష్కరులు దాడులు చేయడం.. వంటి సంఘటనలు జరగడం, ఇండియా, పాకిస్తాన్ ల మధ్య సరైన సయోధ్య లేకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నా... మణిరత్నం సాహసం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళ సినిమా కాట్రు వెళదిలైని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కార్తీ, అదితిరావు హైదరి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామా ఇప్పటికే చెన్నై, ఊటీల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఫైనల్ షెడ్యూల్ జమ్ము కాశ్మీర్ లోని లడఖ్ లో జరుగనున్న ఓ భారీ షెడ్యూల్ కోసం మణి సిద్ధమవుతున్నారు. లడఖ్ లో పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే వారు వేసుకున్న షెడ్యూల్ కాస్త మారే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి షూటింగ్ లు అక్కడ జరగనీయడం మంచిది కాదని అధికారులు తెలియజేస్తున్నారట. ప్రస్తుతం యూరి ఉగ్రదాడి నేపధ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలముకుని ఉంది. ఈ నేపధ్యంలో అక్కడ షూటింగ్ మంచిది కాదని ఆర్మీ అధికారులు మణిరత్నంను హెచ్చరించి, ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా వేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో అనుకున్న ప్రకారం షెడ్యూల్ జరగకపోవచ్చని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇది కూడా చదవండి: హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చి షాకిస్తున్న ముసలి హీరో!

ఇది కూడా చదవండి: అనుమానంతో భార్యను చంపేసి.. ఆ తరువాత ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: చైతూ-సమంతాల ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దాసరి!

English summary

Indian army gave a warning to Maniratnam. Indian army gave a warning to Maniratnam, beacause he want to do his next movie shooting at Jammu-Kashmir border.