సింహం ఎవరికీ భయపడదు సైనికుడి ప్రసంగానికి జేజేలు (వీడియో)

Indian Army Soldier Warns Pakistan By A Video

10:33 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Indian Army Soldier Warns Pakistan By A Video

కశ్మీర్ లోని యూరిలో నిన్న పాక్ నుంచి చొరబడిన ముష్కురులు భారత సైనికులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాక్ పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న సైనికుల్లో ఒకరు భావోద్వేగంతో చెప్పిన కవిత్వానికి సోషల్ మీడియా జేజేలు పలుకుతోంది. షేర్ల మీద షేర్లు చేసుకుంటూ తమలోని దేశభక్తిని చాటుతున్నారు. సింహం ఎవరికీ భయపడదు అంటూ భారత సైనికుడు చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆ సైనికుడు పాక్ పరికిపంద చర్యలకు భారత్ భయపడదని హెచ్చరించాడు. ఇంకా ఏమన్నాడంటే..

'సింహం ఎవరికీ భయపడదు. వెళ్లి ఈ విషయాన్ని పాకిస్థాన్ కు చెప్పండి. అణుబాంబులకు మేం భయపడం. మేం భయపడం బాంబు పేలుళ్లకు. మేం భయపడం దాడులకు. భయపెట్టాలని చూసే వారి వెన్నులో భయన్నా పుట్టిస్తాం. భారతావనిపై మేం తాగే నీటి శక్తి ఏమిటో తెలియజేస్తాం. నాటి యుద్ధంలో అదృష్టం బాగుండి బతికారు. ఆ యుద్ధాన్ని గుర్తు చేసుకోండి. కార్గిల్ యుద్ధాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. పాకిస్థాన్, చెవులు తెరుచుకుని విను. మేం గురిపెడితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో. మీ ఆటలు ఇక సాగనివ్వం' అంటూ కవితాత్మకంగా చెప్పాడు.

తాము తిరగబడితే పాక్ బూడిదేనని, మట్టికొట్టుకుపోతుందని హెచ్చరికలు పంపాడు. ఇంత భావోద్వేగంతో కవితాధోరణిలో తన మనసులోని భావాలను వెల్లడించిన ఆ సైనికుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి:ఈ బైక్ లో బుసలు .. నిజంగానే పాముంది (వీడియో)

ఇవి కూడా చదవండి:రాజమౌళికి షాక్: 'బాహుబలి 2' కి కూడా ఈ గండం తప్పలేదు.. స్టోరీ మొత్తం లీక్ చేసేశారు!

English summary

Recently Pakistan Terrorists attacked URI sector in Kashmir and killed 17 Indian Soldiers and now an Indian soldier warned pakistan in a video by saying that them to remember "Kargil War" he said that Lion(India) never fear by seeing your(pakistan) Nuclear weapons. Now this video was going viral over the internet.