రియో విలేజ్ లో ప్రచారం ఘనం - ఏర్పాట్లు హీనం(వీడియో)

Indian athletes angry on ridiculous facilities on Rio village games

12:28 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Indian athletes angry on ridiculous facilities on Rio village games

అవునా, అంత చేసాం, ఇంత చేసాం అని ఒలింపిక్ నిర్వాహకులు డాబుగా ప్రకటించారు కదా. ఇప్పుడేంటి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. నిజం అసలు అక్కడ ఏర్పాట్లు చాలా అధ్వాన్నంగా వున్నాయట. రియో విలేజ్ లో ప్లేయర్స్.. ముఖ్యంగా ఇండియన్ ఆటగాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావట. తమకు ఎరేంజ్ చేసిన సదుపాయాలన్నీ అరకొరగా ఉన్నాయని, పుల్లెల గోపీచంద్ వంటివారు వాపోతున్నారు. ఆహారం భారతీయ అథ్లెట్ల అభిరుచికి తగ్గట్టుగా లేదని, ఒకప్పుడు ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా చేసిన ఏర్పాట్ల కన్నాఇక్కడ ఇవి అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన అన్నాడు.

హాకీ కోచ్ రోలంట్ ఓల్ట్ మన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బాత్ రూమ్ లు ఘోరంగా ఉన్నాయని కిట్స్ పై ఇండియా అన్న పేరే లేదని, అథ్లెట్లు అశ్విన్, స్వప్న, శ్రావణి, షాట్ పుటర్ మన్ ప్రీత్ వాపోయారు. రూమ్స్ లో టేబుళ్లు, కుర్చీలు కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, లాండ్రీకి బట్టలు వేస్తే సమయానికి సప్లై చేయడం లేదని, నిర్వాహకుల తీరు మీద వాళ్ళు మండి పడ్డారు. అమెరికా వంటి దేశాల క్రీడాకారుల్లో కొందరు సొంత ఖర్చులతో తమ సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నా, మన వద్ద అంత స్తోమత లేదని ఈ అథ్లెట్లు వ్యాఖ్యానించారు. పాపం ఓ ఈవెంట్ నిర్వహించడం అంటే ఆషామాషీ కాదని తెలీదేమో..